విశాఖపట్నం ఏయూ హాస్టల్‌లో ఫిట్స్ వచ్చి విద్యార్థి మణికంఠ మృతి చెందిన ఘటనపై విద్యాశాఖ మంత్రి లోకేష్ స్పందించారు. శుక్రవారం అసెంబ్లీలో మాట్లాడుతూ, 'హాస్టల్‌లో విద్యార్థిని కాపాడుకోలేకపోవడం చాలా బాధాకరం' అని పేర్కొన్నారు. ఈ దురదృష్టకర ఘటనపై విద్యార్థులు ఆందోళనలతో ఆటంకం కలిగించవద్దని ఆయన సూచించారు. ఏవైనా తప్పులుంటే సరిదిద్దుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, అయితే రాజకీయ దురుద్దేశంతో ఆందోళనలు సృష్టిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.