వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఈ నెల 9న నర్సీపట్నం పర్యటనను విజయవంతం చేయాలని విశాఖ జిల్లా వైకాపా నాయకులు పిలుపునిచ్చారు. జిల్లా పార్టీ కార్యాలయంలో సోమవారం జరిగిన సమీక్షా సమావేశంలో జిల్లా అధ్యక్షుడు కె. కె రాజు అధ్యక్షత వహించగా, మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ఉత్తరాంధ్రకు అన్యాయం చేస్తోందని, ముఖ్యంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ, ఆంధ్ర యూనివర్సిటీలో మౌలిక వసతుల లేమిపై ఆందోళన వ్యక్తం చేశారు.