ప్రజాస్వామ్య పరిపాలనలో ఆంక్షలు సరికాదని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. ఆదివారం విశాఖలోని వైవీ సత్యనారాయణ రాసిన ‘బిజినెస్ ఎథిక్’ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా అమెరికా విధిస్తున్న ఆంక్షలపై వెంకయ్యనాయుడు స్పందించారు. ‘‘అగ్రరాజ్యం సఖ్యతతో ఉండాలి కానీ. ఆంక్షలతో కాదు. ప్రధాని మోదీ అనుసరిస్తున్న తీరుతో మనపై అమెరికా ఆంక్షల ప్రభావం చూపలేదు. స్వదేశీ వస్తు నియమాన్ని ప్రోత్సహించాలన్నారు.