రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు, వైసీపీ డిజిటల్ బుక్ పోస్టర్‌ను కృష్ణ కాలేజీ రోడ్డులోని పార్టీ కార్యాలయంలో పార్టీ విశాఖ జిల్లా అధ్యక్షులు కె. కె. రాజు ఆధ్వర్యంలో శనివారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సమన్వయ కర్తలు వాసుపల్లి గణేష్ కుమార్, మొల్లి అప్పారావు, తిప్పల దేవన్ రెడ్డి, మాజీ మేయర్ గోలగాని హరి వెంకట కుమారి, రాష్ట్ర పార్టీ అధికార ప్రతినిధి కొండా రాజీవ్ గాంధీతో పాటు పలువురు రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, డివిజన్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.