కార్మిక సమస్యల పరిష్కారం కోసం పాటుపడిన కార్మిక నాయకుడు ఢిల్లీ రావును సీపీఎం విశాఖ జిల్లా కార్యదర్శి ఎం. జగ్గు నాయుడు కొనియాడారు. ఆదివారం డాబాగార్డెన్స్ లోని అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రంలో ఎం. రాంబాబు అధ్యక్షతన జరిగిన ఢిల్లీ రావు సంస్మరణ సభలో ఆయన మాట్లాడుతూ, ఢిల్లీ రావు సేవలను గుర్తు చేసుకున్నారు. పార్టీ సీనియర్ కామ్రేడ్ పెతకంశెట్టి వెంకటరెడ్డి ఢిల్లీ రావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు.