జనసేన పార్టీ అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గురువారం ఎమ్మెల్యేలతో నిర్వహించిన లెజిస్లేచర్ మీటింగ్‌లో పార్టీ భవిష్యత్తుపై దిశానిర్దేశం చేశారు. కూటమిపై వస్తున్న ఊహాగానాలను ఆయన తోసిపుచ్చుతూ, దేశం, రాష్ట్ర భవిష్యత్తు కోసమే ఈ కూటమి ఏర్పడిందని, అన్ని పార్టీలకు విలువ ఇచ్చి ముందుకు వెళ్తామని స్పష్టం చేశారు.