అనకాపల్లిలో జూనియర్ లైన్ మేన్ గ్రేడ్-2లకు పాత సర్వీస్ రూల్స్ ప్రకారం అసిస్టెంట్ లైన్ మేన్ పదోన్నతులు ఇవ్వాలని ఏఐటీయూసీ రాష్ట్ర సమితి సభ్యుడు కోన లక్ష్మణ డిమాండ్ చేశారు. గవరపాలెం ఎలక్ట్రికల్ ఎస్.ఈ. కార్యాలయంలో ఏడీఎం బి. శ్రీనివాసరావుకు సోమవారం వినతిపత్రం సమర్పించారు. వివక్షపూరిత నూతన సర్వీస్ రూల్స్ రద్దు చేయాలని, బకాయిలతో పాటు ఇతర అలవెన్సులు చెల్లించాలని కోరారు.