అనకాపల్లి ఎంపీ క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడా మంత్రిత్వ శాఖ మై భారత్ ఆధ్వర్యంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ సీఎం రమేష్ సర్దార్ పటేల్ చిత్రపటానికి నివాళులర్పించి, దేశభక్తి, సామాజిక సామరస్యాన్ని ప్రోత్సహించడానికి, ఐక్యతా స్ఫూర్తిని పెంపొందించడానికి యువతను భాగస్వాములను చేస్తూ నెల రోజుల పాటు ‘ఐక్యతా మార్చ్’ ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు.