విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ కుట్రలు ఆపాలి

విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న కుట్రలను వెంటనే నిలిపివేయాలని కార్మిక సంఘాల నేతలు డిమాండ్ చేశారు. జిల్లా జె.ఎ.సి. ఆధ్వర్యంలో బుధవారం విశాఖ జగదాంబ జంక్షన్ నుంచి కలెక్టరేట్ వరకు ప్రదర్శన నిర్వహించి, అనంతరం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా జె.ఎ.సి. నేతలు మాట్లాడుతూ, ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ద్వారా స్టీల్ ప్లాంట్‌ను ముక్కలు చేసి ప్రైవేట్ సంస్థలకు అప్పగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు.

సంబంధిత పోస్ట్