విశాఖ సాగర తీరంలో టీయూ 142 విమానం ఆవరణలో నూతనంగా ఏర్పాటు చేసిన 'మాయా వరల్డ్'ను సంస్థ చైర్మన్ ప్రణవ్ గోపాల్ శుక్రవారం ప్రారంభించారు. దేశంలోనే తొలిసారిగా విశాఖలో ఏర్పాటు చేసిన ఈ మాయా వరల్డ్, నగరవాసులతో పాటు పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటుందని ఆయన తెలిపారు. ప్రపంచ ప్రసిద్ధి చెందిన 'ఇమాజిన్ రూమ్స్' తరహాలో రూపొందించిన ఈ మ్యూజియం, లైటింగ్, అద్దాల ప్రతిబింబాలతో అద్భుత అనుభూతిని ఇస్తుందని పేర్కొన్నారు.