కార్తీక పౌర్ణమి సందర్భంగా భీమిలి తీరంలో బుధవారం రాత్రి 'సూపర్ మూన్' అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. చంద్రుడు భూమికి అత్యంత దగ్గరగా వచ్చిన ఈ అరుదైన సందర్భంలో, సాధారణ పౌర్ణమి చంద్రుడి కంటే ఇది మరింత పెద్దగా, కాంతివంతంగా కనిపించింది. ఈ ఏడాదిలో ఇది రెండోసారి ఇలా చంద్రుడు భూమికి సమీపంగా రావడం గమనార్హం. ఈ అద్భుత దృశ్యాన్ని తిలకించడానికి తీర ప్రాంతానికి అధిక సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు.