కొత్తకోట;షిరిడీ సాయిబాబా ఆలయాల్లో ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు

రావికమతం మండలం కొత్తకోట, రావికమతం, మేడివాడ, తట్టబంద సాయినగర్ గ్రామాల్లో గల షిరిడి సాయిబాబా ఆలయాల్లో గురువారం గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెల్లవారు జామునుంచే బాబా ఆలయాలు భక్తులతో కిట కిటలాడాయి. ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈసందర్బంగా ఆలయాలు వద్ద అన్న సమారాధన కార్యక్రమాలు నిర్వహించారు. సాయంత్రం పల్లకి ఊరేగింపు కార్యక్రమం నిర్వహించారు. అనంతరం గ్రామ సంకీర్తన నిర్వహించారు.

సంబంధిత పోస్ట్