చోడవరం ప్రభుత్వాసుపత్రిలో ఎక్స్రే ప్లాంట్ ప్రారంభం

చోడవరం ప్రభుత్వ ఆసుపత్రిలో శనివారం నూతనంగా ఏర్పాటు చేసిన ఎక్సరే సెంటర్ ను స్థానిక ఎమ్మెల్యే కె ఎస్ ఎన్ ఎస్ రాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన రోగులను పరామర్శించి, ఎక్సరే ప్లాంట్ ఏర్పాటుతో మరిన్ని ఉచిత సేవలు అందుతాయని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎండిఓ ఆంజనేయులు, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసరావు, గూనూరు మల్లునాయుడు, గూనూరు పెదబాబు, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ దేవరపల్లి వెంకటప్పారావు, టిడిపి పట్టణ అధ్యక్షులు యర్రంశెట్టి చిన్న, ఎంపీటీసీ రూపదేవి చిన్న తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్