విశాఖ శివారులోని ఆనందపురం మండలం మామిడిలోవ పంచాయతీలో పోలీసులు మంగళవారం భారీ మొత్తంలో గోమాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు. గుట్టుచప్పుడు కాకుండా గోమాంసాన్ని ఎగుమతి చేస్తున్నట్లు సమాచారం అందడంతో, వెటర్నరీ డాక్టర్ ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు 1.89 లక్షల కేజీల గోమాంసాన్ని సీజ్ చేశారు. నిర్వాహకులపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది.