విశాఖపట్నంలో ఆదివారం ఈగల్ టీం, సిటీ టాస్క్‌ఫోర్స్ పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. డ్రగ్స్ తరలిస్తున్న చరణ్ అనే యువకుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, అతని వద్ద నుంచి 36 ఎల్ఎస్‌డీ బ్లాట్స్ స్వాధీనం చేసుకున్నారు. విచారణలో, ఈ డ్రగ్స్ విశాఖపట్నంలోని కొంతమంది ప్రముఖుల కోసం తెచ్చినట్లు వెల్లడైంది. ఈ సమాచారం ఆధారంగా వైసీపీ స్టూడెంట్ వింగ్ అధ్యక్షుడు కొండారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. యువకుడిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగుతోంది.