బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా విశాఖపట్నంలో వాతావరణం మేఘావృతమైంది. శుక్రవారం, బీచ్ రోడ్డు, సిరిపురం, మద్దిలపాలెం, అక్కయ్యపాలెం ప్రాంతాల్లో చిరుజల్లులు కురిశాయి. ఉత్తరాంధ్ర వ్యాప్తంగా శుక్రవారం, శనివారం కూడా ఓ మోస్తరు వర్షం కురుస్తుందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది.