విశాఖపట్నంలోని శ్రీనగర్ జాతీయ రహదారిపై బుధవారం తెల్లవారుజామున లారీ డ్రైవర్ రవి అనుమానాస్పద స్థితిలో మరణించారు. అనకాపల్లి జిల్లా రావికమతం గ్రామానికి చెందిన రవి సాగర్ సిమెంట్ ఫ్యాక్టరీలో లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. మృతదేహాన్ని చూసిన స్థానికులు గాజువాక పోలీసులకు సమాచారం అందించారు. మృతుడికి భార్య, పిల్లలు ఉన్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.