విశాఖ డ్రగ్స్ కేసులో ముగ్గురు యువకులు అరెస్ట్

విశాఖ రైల్వే స్టేషన్ వద్ద డ్రగ్స్ కేసులో ముగ్గురు యువకులు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వైసీపీ విద్యార్థి విభాగం నాయకుడు కొండారెడ్డి, గుడివాడకు చెందిన బీటెక్ విద్యార్థి చరణ్‌ను డ్రగ్స్ కోసం బెంగళూరు పంపించినట్లు విచారణలో తేలింది. చరణ్ అక్కడ సంత్‌ నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసి దురంతో రైలులో విశాఖకు చేరుకున్నాడు. అతన్ని స్కైలమ్‌కు చెందిన హర్షవర్థన్ రిసీవ్ చేసుకున్నాడు. సోమవారం ముగ్గురినీ అరెస్టు చేసినట్లు డీసీపీ మేరీ ప్రశాంతి తెలిపారు.

సంబంధిత పోస్ట్