విశాఖపట్నంలోని జీవీఎంసీ 58వ వార్డు, రామ్ నగర్‌లో ఆదివారం ఒక ఇంట్లో నాగుపాము కనిపించడంతో కలకలం రేగింది. బుసలు కొడుతున్న పామును చూసి కుటుంబ సభ్యులు భయపడ్డారు. సమాచారం అందుకున్న స్నేక్ కేచర్ కిరణ్ వెంటనే స్పందించి, పామును సురక్షితంగా పట్టుకుని రెస్క్యూ చేశారు. ఈ సంఘటనతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.