విశాఖ, అనకాపల్లి, అల్లూరి జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ ప్రకటించారు. సోమవారం విశాఖ వాతావరణ శాఖ అధికారి జగన్నాథకుమార్ తెలిపిన వివరాల ప్రకారం, మంగళవారం ఈ జిల్లాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మత్స్యకారులను వేటకు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేశారు. మైండ్ మరి సమీపంలో ఈశాన్య బంగాళాఖాతంలో సోమవారం ప్రారంభమైన అల్పపీడనం 24 గంటల్లో భారీగా మారే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.