విశాఖపట్నం జగదాంబ జంక్షన్ లో నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసిన సినీ నటుడు స్వర్గీయ సూపర్ స్టార్ కృష్ణ విగ్రహాన్ని జీవీఎంసీ అధికారులు సోమవారం తొలగించారు. ఎనిమిది ఏళ్లుగా ఉన్న జనసేన జెండా దిమ్మను, పార్టీ సిద్ధాంతాల బోర్డును తొలగించి, వాటి స్థానంలో కృష్ణ విగ్రహం ఏర్పాటు చేయడం వివాదాస్పదమైంది. దీనిపై జనసేన పార్టీ కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ జిల్లా కలెక్టర్, నగర పోలీస్ కమిషనర్, జీవీఎంసీ కమీషనర్ లకు ఫిర్యాదు చేశారు.