గాజువాక: బస్సుని ఢీకొని ఒకరు మృతి

గాజువాక జింక్ గేట్ సమీపంలో శనివారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో అజీమాబాద్కు చెందిన సల్మాన్ మృతి చెందాడు. హిమాచల్ నగర్ వద్ద బైకుపై వెళ్తున్న అతను రోడ్డు మీద ఆగి ఉన్న ఫార్మసిటీకి చెందిన బస్సును ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. రాత్రి సమయం కావడంతో పార్క్ చేసిన బస్సు కనిపించకపోవడంతో ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చు అని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్