గాజువాకలో వ్యభిచార ముఠా బట్టబయలు: టాస్క్ ఫోర్స్ దాడి

విశాఖపట్నం గాజువాక పరిధిలోని అఫీషియల్ కాలనీ ఆంజనేయ స్వామి ఆలయం సమీపంలో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న వ్యభిచార కేంద్రాన్ని టాస్క్ ఫోర్స్ పోలీసులు రట్టు చేశారు. పక్కా సమాచారంతో దాడులు నిర్వహించిన పోలీసులు, నిర్వాహకులతో పాటు విటులను, కొందరు మహిళలను అదుపులోకి తీసుకున్నారు. నివాస ప్రాంతాల మధ్య ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలు సాగుతుండటం స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్