కార్తీక పౌర్ణమి సందర్భంగా మాడుగుల శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో బుధవారం రాత్రి జ్వాలా తోరణం కార్యక్రమం వైభవంగా జరిగింది. అర్చకులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం, భక్తులు జ్వాలా తోరణంలో మూడుసార్లు ప్రదక్షిణ చేసి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం స్వామివారికి అభిషేకం, మహిళల పారాయణం జరిగాయి. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు నిర్వహించారు.