మాడుగుల పంటలను పరిశీలించిన కూటమి నాయకులు

గురువారం పొంగలిపాక, శివరాంపురం గ్రామాల్లో తుఫాను కారణంగా జరిగిన పంట నష్టాన్ని సచివాలయ అగ్రికల్చర్ అసిస్టెంట్ గణేషు, కింతలి పిఎసిఎస్ చైర్పర్సన్ ఉండూరు దేముడు, జనసేన నాయకులు పచ్చి కోర నాగు, కోన నల్లన్న, గుంది కన్నారావు తదితరులు పరిశీలించారు. పెద్దగా వరిచేలు పడిపోలేదని, అక్కడక్కడ చిన్నపాటి ఇబ్బంది తప్ప ముందు జాగ్రత్త చర్యల వల్ల రైతులు జాగ్రత్త పడ్డారని తెలిపారు. ఉండూరు సుభద్రమ్మ, ఉండూరు లక్ష్మి పొలంలో సుమారు ఒక హెక్టారు వరి తుఫాన్ వల్ల గింజ నలుపు రోగికి మారటం, మానుపుడి కాయలు రావడం జరిగిందని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్