తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్న 'సుపరిపాలనలో తొలి అడుగు' కార్యక్రమంలో భాగంగా సోమవారం స్పెషల్ డ్రైవ్ నిర్వహించనున్నట్టు స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి ఆదివారం సాయంత్రం తెలిపారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో డోర్ టూ డోర్ కాంపెయిన్ పై స్పెషల్ డ్రైవ్ లో ప్రతి ఊరులో ప్రతి బూత్ లో, బూత్ కు 40 ఇళ్లకు తగ్గకుండా సందర్శించి మై టీడీపీ యాప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు.