బుధవారం మధ్యాహ్నం మాడుగుల మండలం కింతలి గ్రామంలో మూడు కోట్ల 37 లక్షల రూపాయలతో నిర్మించిన విద్యుత్ సబ్స్టేషన్ను రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి, రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ బత్తుల తాతయ్య బాబు, ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి రావు, ఏపీ ఈపీడీసీఎల్ సిఎండి పృధ్వితేజ్, ఎస్సీ జీ ప్రసాద్, స్థానిక విద్యుత్ అధికారులు, కూటమ నాయకులు పాల్గొన్నారు. ఈ సబ్స్టేషన్ ప్రారంభోత్సవం స్థానిక ప్రజలకు విద్యుత్ సరఫరాను మెరుగుపరుస్తుందని భావిస్తున్నారు.