వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ

దేవరాపల్లి మండలం, కలిగొట్ల గ్రామంలో గ్రామ సర్పంచ్ గొర్రెపోటు సుధారాణి, ఎంపీటీసీ రుత్తల వరలక్ష్మి ఆధ్వర్యంలో మంగళవారం వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు నిరసనగా కోటి సంతకాల కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు ఈ కార్యక్రమంలో పాల్గొని, రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం 17 మెడికల్ కాలేజీలను అన్యాయంగా ప్రైవేట్పరం చేసే కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి రాష్ట్రవ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని తెలిపారు.

సంబంధిత పోస్ట్