విశాఖలో ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రిజల్యూషన్ (ఏడీఆర్) ఎకో సిస్టం ఏర్పాటుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం చంద్రబాబు తెలిపారు. పెరుగుతున్న కేసుల సంఖ్యను తగ్గించేందుకు కొత్త కోర్టులతో పాటు మీడియేషన్, ఆర్బిట్రేషన్ వంటి ప్రత్యామ్నాయ వ్యవస్థలను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. చాలామంది కోర్టులకు వెళ్లడాన్ని అసౌకర్యంగా భావిస్తున్నందున, మీడియేషన్ ఒక ఉత్తమ పరిష్కార మార్గంగా నిలుస్తోందని తెలిపారు.