విశాఖ: బాబా అవతారమెత్తిన హత్యకేసులో నిందితుడి అరెస్టు

హత్య కేసులో బెయిల్ పై వచ్చి, బాబా వేషంలో అజ్ఞాతంలో ఉన్న రౌడీ షీటర్ యుగంధర్‌ను విశాఖ పోలీసులు శనివారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. రౌడీ షీట్ తెరవబడిన తరువాత కోర్టుకు గైర్హాజరై అజ్ఞాతంలోకి వెళ్ళిన ఇతను, హిమాలయాలలో భైరవ స్వామిగా పేరు మార్చుకొని అవతారం ఎత్తినట్టు పోలీసులు గుర్తించారు. నిరంతర నిఘా, సాంకేతిక పరిజ్ఞానం సాయంతో పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి అతడిని పట్టుకున్నారు. ఈ కేసు దర్యాప్తులో చురుగ్గా వ్యవహరించిన సీఐ ఎర్రం నాయుడు, ఎస్‌ఐలు సతీష్, మన్మధరావులను పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి, ఏసీపీ లక్ష్మణమూర్తి అభినందించారు.

సంబంధిత పోస్ట్