మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై హోంమంత్రి అనిత గురువారం షాకింగ్ కామెంట్స్ చేశారు. జగన్ మానసిక పరిస్థితిపై ముందుగా చర్చ జరగాలని తెలిపారు. ప్రస్తుతం జగన్ జైలు యాత్రలు చేస్తున్నాడంటూ విమర్శించారు. మహిళలపై నీచాతి నీచంగా మాట్లాడిన వ్యక్తిని జగన్ పరామర్శించడం జుగుప్సాకరంగా ఉందన్నారు. ప్రసన్న కుమార్ రెడ్డి మాటలను జగన్ సమర్ధిస్తున్నారా? అంటూ ఆమె ప్రశ్నించారు.