గూడెంకొత్తవీధి మండలం నేలజర్త ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఒక్క టీచర్ కూడా లేకుండా నడుస్తుందని గ్రామస్థులు తెలిపారు. 126 మంది విద్యార్థులు ఉన్న ఈ పాఠశాలలో గత 3నెలలుగా టీచర్ లేరని, వాలంటీర్తో నడుస్తుందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ చిన్నారులంతా చదువుకు దూరం అయ్యే పరిస్థితి నెలకొందన్నారు. పలు మార్లు అధికారులకు తెలియజేసినా పట్టించుకోలేదని వాపోయారు. జిల్లా కలెక్టర్ తగు చర్యలు తీసుకోవాలన్నారు.