రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించే ప్రయత్నం చేస్తోందని ఆరోపిస్తూ, వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం రాజవొమ్మంగి గాంధీ బొమ్మ సెంటర్ వద్ద ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ అనంతబాబు, మాజీ ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి సూచనలతో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రజలకు అందుబాటులో ఉండాలని, ప్రైవేటీకరణతో పేద విద్యార్థులు నష్టపోతారని ఈ సందర్భంగా తెలిపారు.