రంపచోడవరం కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేయాలి

పోలవరం నిర్వాసితుల సమస్యలు త్వరగా పరిష్కారం కావాలంటే రంపచోడవరం కేంద్రంగా నూతన జిల్లా ఏర్పాటు చేయాలని సీపీఎం మండల కార్యదర్శి పులి సంతోష్ కుమార్ డిమాండ్ చేశారు. శుక్రవారం చొక్కనపల్లి గ్రామంలో జరిగిన పార్టీ జనరల్ బాడీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రస్తుత జిల్లా కేంద్రం పాడేరు ప్రజలకు అందని ద్రాక్షలా మారిందని, ప్రజలు జిల్లా అధికారులను నేరుగా కలవలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రంపచోడవరంలోని 11 మండలాలు, ఏలూరులోని 4 మండలాలు, నాన్ షెడ్యూల్ ప్రాంత గిరిజన గ్రామాలను కలుపుతూ కొత్త జిల్లా ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు.

సంబంధిత పోస్ట్