గిరిజన హక్కుల కోసం పోరాడిన ఆదివాసీ వీరుడు భగవాన్ బిర్సా ముండా 150వ జయంతిని పురస్కరించుకొని రంపచోడవరం ఐటీడీఏ కార్యాలయంలో జాతీయ గౌరవ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎస్. బోజ్జిరెడ్డి, ఎస్టీ కమిటీ డైరెక్టర్ గొర్లె సునీత, డిఎస్పి సాయి ప్రశాంత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతులకు ₹46. 62 లక్షల వ్యయంతో 36 పవర్ టిల్లర్లు, ₹12 లక్షల విలువైన 100 ఆయిల్ ఇంజిన్లు సబ్సిడీపై పంపిణీ చేశారు. బ్రిటిష్ వ్యతిరేక పోరాట యోధుడు బంధాల చంద్రయ్య వారసులను సత్కరించారు.