మారేడుమిల్లిలో మూడు రోజుల పాటు జరగనున్న ఏకలవ్య పాఠశాలల కళా ఉత్సవ్ 2025 కార్యక్రమాన్ని గురుకులాల సంయుక్త కార్యదర్శి వై. వి. ఎస్. ప్రసాద్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. గిరిజన విద్యార్థులలో ప్రతిభ, పాటవాలను ప్రోత్సహించేందుకు ఈ కళా ఉత్సవ్ నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సార్ల లలిత కుమారి, వైస్ ఎంపీపీ రవికుమార్, సర్పంచ్ జాకోబు, గురుకులాల డిప్యూటీ కార్యదర్శులు కిషోర్ బాబూ, మధుసూదన్ వర్మ, ఉప సమాచకులు రుగ్మాoగదయ్య, ప్రిన్సిపాల్ శంకర ప్రసాద్, ఎంపీడీఓ రవి కిషోర్, తహసీల్దార్ బాలాజీ, సీఐ గోపి నరేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు నృత్యాలు, వేషధారణ వంటి కార్యక్రమాలలో పాల్గొన్నారు.