రంపచోడవరం రూరల్, ఐ. పోలవరం గోవింద గిరిలోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో నవంబర్ 5న (బుధవారం) సాయంత్రం 6.30 గంటలకు కార్తీక పౌర్ణమి దీపోత్సవం జరగనుంది. ఆలయ అధికారులు రూపు సాయి, ఢిల్లీ ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం, భక్తులు వత్తులు, నువ్వుల నూనెతో దీపాలు వెలిగించాలి. చమురు లేదా ఇతర నూనెలకు బదులుగా నువ్వుల నూనెనే వాడాలని అర్చకులు సూచించారు.