కనీస వేతనాలు అమలు చేయాలి మట్ల వాణిశ్రీ

వై. రామవరం మండలం తోటకూరపాలెంలో సిఐటియు నాలుగవ మండల మహాసభ సీనియర్ నాయకురాలు కే. బుల్లెమ్మ జెండా ఆవిష్కరణతో ఘనంగా జరిగింది. ఈ సమావేశంలో కే. శాంతిరాజు కన్వీనర్‌గా, జి. బేబీ రాణి కో-కన్వీనర్‌గా కొత్త మండల కమిటీని ఎన్నుకున్నారు. సిఐటియు జిల్లా అధ్యక్షురాలు మట్ల వాణిశ్రీ మాట్లాడుతూ, ప్రభుత్వాలు కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయడంలో విఫలమయ్యాయని విమర్శించారు. సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని ఆమె డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్