విశాఖపట్నం నగరంలో సాగర తీర అందాలను తిలకించేందుకు ఏపీఎస్‌ఆర్టీసీ ప్రత్యేక డబుల్ డెక్కర్ బస్సులను సిద్ధం చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం ఈ బస్సులను ప్రారంభించనున్నారు. ఈ బస్సులు రుషికొండ, భీమిలి, సాగర తీరం, యారాడ బీచ్ వంటి ప్రముఖ పర్యాటక ప్రాంతాలకు ప్రయాణికులను తీసుకెళ్తాయి. అద్దాల మధ్య నుంచి ప్రశాంతమైన సముద్ర తీర అందాలను ఆస్వాదించవచ్చని ఏపీఎస్‌ఆర్టీసీ తెలిపింది.