విశాఖపట్నంలో ఈరోజు ఉదయం 4.10 నుండి 4.20 గంటల మధ్య కొన్ని సెకండ్ల పాటు భూమి కంపించింది. నాలుగు సెకండ్ల పాటు భూకంపం సంభవించినట్లు పలు ప్రాంతాల్లో సమాచారం. నగర ప్రజలు గాఢ నిద్రలో ఉన్న సమయంలో ఒక్కసారిగా పెద్ద శబ్దం, భూమి కనిపించినట్టు అనుభూతి చెందారు. బీచ్ రోడ్, సీతమ్మధార, గోపాల్పట్నం ప్రాంతాల్లో భూమి కంపించినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.