విశాఖపట్నం నగరంలో మంగళవారం తెల్లవారుజామున స్వల్ప భూకంపం సంభవించింది. ఉదయం నాలుగు గంటల సమయంలో భూమి కంపించడంతో అక్కయ్యపాలెం, మద్దిలపాలెం, ఎంవీపీకాలనీ, బీచ్‌రోడ్డు, మధురవాడ, కొమ్మాది వంటి ప్రాంతాల ప్రజలు భయాందోళనకు గురయ్యారు. విశాఖ వాతావరణ కేంద్రం ఈ విషయాన్ని మంగళవారం నిర్ధారించింది. భూకంపం తీవ్రత రిక్టర్ స్కేల్‌పై ఎంత అన్నది ఇంకా తెలియాల్సి ఉంది.