విశాఖలో నడిరోడ్డుపై ఆర్టీసీ బస్సు దగ్ధం

విశాఖపట్నంలో శుక్రవారం ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదురుగా జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సు ఇంజిన్‌లో మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. కూర్మన్నపాలెం నుంచి విజయనగరం వెళ్తున్న బస్సులో ఈ ఘటన చోటుచేసుకుంది. డ్రైవర్ అప్రమత్తతతో ప్రయాణికులందరినీ సురక్షితంగా బయటకు దింపడంతో పెను ప్రమాదం తప్పింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్