విశాఖ: వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం

వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది పశ్చిమ బెంగాల్-ఒడిశా తీరాలకు ఆనుకుని ఉన్న ఉపరితల ఆవర్తనం వల్ల మరింత బలపడుతోందని విశాఖ వాతావరణ కేంద్రం ఆదివారం రాత్రి వెల్లడించింది. ఎల్లుండి బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో మూడు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

సంబంధిత పోస్ట్