మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం జరిగిన జనవాణి కార్యక్రమంలో పలువురు తమ సమస్యలను తెలియజేశారు. విశాఖ దక్షిణ నియోజకవర్గ శాసనసభ్యులు, జనసేన పార్టీ విశాఖ నగర అధ్యక్షులు వంశీకృష్ణ శ్రీనివాస్ అర్జీలు స్వీకరించి, సత్వర పరిష్కారానికి అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. పరిష్కారం కాని సమస్యలపై సంబంధిత అధికారులకు, నేతలకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు వేణు, ఇతర పెద్దలు పాల్గొన్నారు.