విశాఖలోని మర్రిపాలెం రైల్వే డీజిల్ లోకో షెడ్ వద్ద శనివారం రాత్రి కొండచిలువ హల్చల్ చేసింది. సాయంత్రం వర్షం పడిన తరువాత డీజిల్ లోకో షెడ్ పరిసరాలలో కొందరు ఉద్యోగులు కొండచిలువను గమనించారు. నిర్మానుష్య ప్రాంతంలో అధికంగా ఉండే చెట్ల కారణంగా పాములు తిరుగుతున్నట్లు వారు తెలిపారు. అనంతరం మొక్కలలోకి వెళ్లిపోయిందని చెప్పారు.