ఉత్తరాంధ్రలో నాణ్యమైన కంటి వైద్య సేవలు అందిస్తున్న శంకర్ ఫౌండేషన్ ఐ హాస్పిటల్‌లో బుధవారం అత్యుత్తమ ఆరోగ్య సంరక్షణ కళాశాల విద్యార్థులకు అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. డిప్లొమా, ఓటీ కోర్సులలో 50 మంది విద్యార్థులు 100 శాతం ఉత్తీర్ణత సాధించగా, బీఎస్సీ ఆప్టోమెట్రీ చివరి సంవత్సరం పరీక్షలలో 15 మంది, ఇతర విద్యార్థులు 14 మంది ఉత్తీర్ణులయ్యారు. వీరిని ఆసుపత్రి డీజీఎం బంగారు రాజు సత్కరించారు.