విశాఖలోని నేవల్ క్యాంటీన్ స్టోర్‌రూమ్‌లో అట్టపెట్టెలో దాగున్న అరుదైన శ్వేత నాగు శనివారం కలకలం సృష్టించింది. సమాచారం అందుకున్న స్నేక్ కేచర్ నాగరాజు చాకచక్యంగా పామును పట్టుకున్నారు. పాముకు గాయం కావడంతో, నాగరాజు దానిని మల్కాపురం వెటర్నరీ హాస్పిటల్‌కు తరలించారు. వెటర్నరీ డాక్టర్ సునీల్ పాముకు 8 కుట్లు వేసి చికిత్స అందించారు. అనంతరం ఆ పామును అటవీ ప్రాంతంలో సురక్షితంగా విడిచిపెట్టేందుకు చర్యలు తీసుకున్నారు.