ఎలమంచిలి రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి!

ఎలమంచిలి మండలం కొక్కిరాపల్లి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 11 మంది గాయపడ్డారు. వారిలో ఎనిమిది మందికి తీవ్ర గాయాలు కావడంతో కేజీహెచ్, అనకాపల్లి జిల్లా ఆసుపత్రులకు తరలించినట్లు ఎలమంచిలి ప్రభుత్వ వైద్యులు తెలిపారు. మిగిలిన ముగ్గురికి స్థానిక ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నామని చెప్పారు. ఈ ప్రమాదంలో ఆసుపత్రికి తరలించిన వారిలో ఇద్దరు మృతి చెందినట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్