పులివెందులకు కూడా మేమే నీరు ఇచ్చాం : సీఎం

అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని మెజారిటీ ప్రాజెక్టులను తానే ప్రారంభించానని తెలిపారు. ఇప్పుడు రాయలసీమను 'రతనాల సీమ'గా మారుస్తున్నట్లు చెప్పారు. గతంలో పులివెందులకు కూడా తామే నీళ్లిచ్చామని పేర్కొన్నారు. కుప్పానికి కృష్ణా జలాలను తరలించి జలహారతి ఇవ్వడం తన జీవితానికి సార్థకత అని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ను కరవు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దుతానని ఆయన ప్రకటించారు.

సంబంధిత పోస్ట్