ప్రతి ఇంటికి హైజీన్ కిట్లు పంపిణీ చేస్తున్నాం: కలెక్టర్

AP: విజయవాడ న్యూరాజరాజేశ్వరిపేటలో డయేరియా విజృంభించడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. శనివారం మంత్రి నారాయణ డయేరియా బాధితులను పరామర్శించి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ప్రతి ఇంటికి హైజీన్ కిట్లు పంపిణీ చేస్తున్నామని జిల్లా కలెక్టర్ జి.లక్ష్మీశ తెలిపారు. డయేరియాపై అవగాహన కల్పిస్తున్నామని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. సహాయం కోసం 91549 70454 నంబర్‌కు కాల్ చేయాలన్నారు.

సంబంధిత పోస్ట్